వైఎస్ జగన్‌కి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాస్ వార్నింగ్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. పిచ్చి జగన్మోహన్ రెడ్డి.. సైకో జగన్మోహన్ రెడ్డిగా మారటమే జగన్ 2.0 అని ఫైర్ అయ్యారు.
శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయమ్మ, షర్మిల ఆయుష్షు గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ తీరు మారకుంటే... గతసారి 11 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి చొక్కా పట్టుకుని రాష్ట్రం బయటకు గెంటుతారన్నారు।
ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించటం ఒక్కటే ఇక మిగిలి ఉన్నందున.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మంత్రి సంధ్యారాణి జగన్ ను హెచ్చరించారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని.. లండన్ లో తెచ్చుకున్న మందులు పని చేయట్లేదని జగన్ మానసిక పరిస్థితి చూస్తే అర్థమవుతోంది సెటైర్లు వేశారు.జగన్ మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి నేను సిఫార్సు చేస్తానని ఘాటుగా కామెంట్స్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతోనైనా జగన్ ఓ మంచి డాక్టర్ కు చూపించుకోవాలన్నారు మంత్రి.

ఇక అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే.. స్పీకర్ చెప్పాలి అనడం చూస్తుంటే జగన్ కు పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో అర్ధమవుతోందని మండిపడ్డారు. 5ఏళ్ళు బూతులు మాట్లాడిన జగన్ నోట.. ఇప్పుడు నీతులు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. జగన్ కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు.. ఇంగ్లీషులో అర్ధం తెలీదని ఫైర్ అయ్యారు. అబద్ధాల్లో సైతం ఆస్కార్ పొందే వ్యక్తి సైకో జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.
పెద్దవాళ్లంటే జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి విమర్శించారు. రూ.20 వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలని.. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్‌ది అని సంధ్యారాణి విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications