నారా లోకేష్ కోసం 172 కోట్లతో స్పెషల్ హెలికాఫ్టర్ ? తేల్చేసిన మంత్రి..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసిందని గతంలో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు పదే పదే ఆరోపించేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కూడా అవే ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ కోసం రూ.172 కోట్ల ఖర్చుతో కొత్త హెలికాఫ్టర్ కొనుగోలు చేసినట్లు వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. లోకేష్ షికార్ల కోసమే ఈ హెలికాఫ్టర్ కొన్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మంత్రి నారా లోకేష్ కోసం రూ.172 కోట్లు దుర్వినియోగం చేసి హెచ్ 160 కొత్త హెలికాఫ్టర్ ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఇవాళ స్వయంగా ఆయనే స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో క్లారిటీ ఇస్తూ ఓ పోస్టు పెట్టారు. ఇందులో వైసీపీ చేస్తున్న ప్రచారం ఫొటోను కూడా తన ట్వీట్ కు లోకేష్ జత చేశారు. ఇందులో సదరు హెలికాఫ్టర్ కమింగ్ సూన్ అంటే త్వరలో అందుబాటులోకి వస్తుందని వైసీపీ తెలిపింది.

ap minister nara lokesh clarified to Rs 172 cr worth vip helicopter purchase for him

దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి లోకేష్.. కొనుగోలు చెయ్యడానికి నీలా కొట్టేసిన డబ్బు నా దగ్గర లేదు జగన్ రెడ్డి గారు! ఫేక్ రాతలకు బహుమతి గా ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీ బుద్ధి మారడం లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తద్వారా వైసీపీ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో లోకేష్ కోసం ప్రభుత్వం రూ.172 కోట్లతో హెలికాఫ్టర్ కొనుగోలు చేస్తున్నట్లు వైసీపీ చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అని తేలిపోయింది. లోకేష్ క్లారిటీపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+