భారీగా ఐటీ కంపెనీలు, జగన్ గురించి ఇక్కడ కాదు, అన్నీ మావే: లోకేష్ నిప్పులు
అమరావతి: ఒకటి రెండు నెలల్లో ఏపీకి భారీగా కంపెనీలు రానున్నాయని, 2019 లోపు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ సోమవారం చెప్పారు. నవ్యాంధ్రలో ఒకేసారి ఏడు కొత్త ఐటీ సంస్థలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 36 ఐటీ కంపెనీలను ప్రారంభంచామని, 3684 మందికి ఉపాధి కల్పించామన్నారు. దేశంలో తయారయ్యే ఫోన్లలో ఏపీ నుంచే 26 శాతం అన్నారు.

కొత్త కంపెనీలతో..
కొత్త కంపెనీలతో 280 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని లోకేష్ చెప్పారు. మరో రెండు నెలల్లో వచ్చే భారీ కంపెనీలతో 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కంపెనీలను ఆహ్వానించేందుకు టెక్నాలజీ, ఫైనాన్షియల్ పాలసీ తెచ్చామన్నారు. ఐటీ కంపెనీల్లో ఆక్యుపెన్సీ 70 శాతం రాకుంటే 50 శాతం రాయితీ ఇస్తామన్నారు.

ఏపీ ప్రజలు షార్ప్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా షార్ప్ అని, ఎక్కడైనా అవకాశాలు దక్కించుకోగలరన్నారు. మా కష్టానికి ఫలితంగా మరో ముప్పై రోజుల్లో కంపెనీలు రానున్నాయని చెప్పారు. గన్నవరంలో 100 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అడిగిన వెంటనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని అన్నారు.

జగన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, ఈ కార్యక్రమంలో ప్రసంగాల లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసిపి ప్లీనరీలో చేసిన విమర్శలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై లోకేష్.. 'హలో సచివాలయంలో మాట్లాడదాం. ప్లీజ్... ఇక్కడ స్క్రిప్టు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్' అన్నారు. అనంతరం కాసేపటికి లోకేష్ వైసిపిపై మాట్లాడారు. పెళ్లి వంటి శుభకార్యాలు తలపెట్టినా కూడా వాటిని అడ్డుకునేందుకు చేసే వారుంటారన్నారు. తాము ప్రారంభిస్తున్న ఐటీ కంపెనీలనూ విపక్షాలు అడ్డుకునేందుకు చూస్తున్నాయన్నారు. విమర్శలు గుప్పించారు.

నమ్మకం లేకే ప్రశాంత్ కిషోర్
వైసిపి అధినేత జగన్‌కు తనపై నమ్మకం లేకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. అర్థం లేని ఆరోపణలతో పుస్తకాలు వేస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబును తిట్టేందుకే ప్లీనరీ అన్నారు. అభివృద్ధిని చూసి కొందరు అసూయ పడుతున్నారన్నారు. జగన్ నిన్న ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో అంతా 2014లో తాము చెప్పినవి, అమలు చేస్తున్నవేనని లోకేష్ అన్నారు.












Click it and Unblock the Notifications