మంగళగిరిలో వాకర్స్ కు లోకేష్ గుడ్ న్యూస్..మరో ఫ్రీ స్కీమ్..!
ఏపీలో గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మంత్రి నారా లోకేష్.. దీన్ని తన కంచుకోటగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి ప్రజల కోసం రెగ్యులర్ గా ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్న నారా లోకేష్.. స్థానికంగా పలు సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. ఇదే క్రమంలో స్థానిక వాకర్లు తమకు నియోజకవర్గంలోని ఎకో పార్క్ లో ఉచితంగా నడిచేందుకు వీలు కల్పించాలని లోకేష్ ను కోరారు.
దీనిపై స్పందించిన నారా లోకేష్ అటవీ శాఖ పరిధిలో ఉన్న మంగళగిరి ఎకో పార్క్ లో ఉచితంగా వాకర్స్ కు ఎంట్రీ కల్పించడం సాధ్యం కాదని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో తానే స్వయంగా వీరి ఎంట్రీ ఫీజు చెల్లించి వాకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ లోకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో తాను ఎన్నికల హామీని ఎలా నిలబెట్టుకుంటున్నానో వివరించారు.

మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశ రుసుం తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో తనను కోరారని లోకేష్ తెలిపారు. దీనిపై తాను వారికి మాట ఇచ్చానన్నారు. ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడానని, అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని , రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారన్నారు.
కాబట్టి వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్కింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షలరూపాయలను తన వ్యక్తిగత నిధులనుంచి చెల్లించినట్లు తెలిపారు. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6 గంటల నుంచి 9 గంటలవరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చని లోకేష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications