అప్పుడు కాళ్లు భూమి మీద ఆనలే, కళ్లు నెత్తికెక్కాయి: చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విసుర్లు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో అపద్దర్మ ముఖ్యమంత్రి మీరు వ్యవహరించిన తీరు ఏంటీ అని అడిగారు. ఇప్పుడు నీతులు చెబుతారా అని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సంఘం వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని మాత్రమే చెప్పారు.. తప్పా మరొ మాట మాట్లాడలేదన్నారు. ఈసీ రమేశ్ కుమార్ చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయారా అనే సస్పెక్ట్ మాత్రం వ్యక్తం చేశారని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాళ్లు భూమి మీద అనలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. కళ్లు తలపై ఉన్నాయని.. ఇప్పుడు మాత్రం సూక్తులు చెబుతున్నారని మండిపడ్డారు. పైగా ఈసీని సీఎం దూషించినట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇది సరికాదన్నారు. లేని కామెంట్లను అన్నట్టు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. చంద్రబాబు మాయలో ఈసీ పనిచేస్తున్నారా అని మాత్రమే సీఎం అనుమానం వ్యక్తం చేశారని వివరించారు.

Recommended Video
గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు నాయుడు దూషించిన విధానాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. వీడియోలు చూపించాలా అని అడిగారు. ప్రధాని మోడీకి లింక్ పెట్టి చేసిన కామెంట్లు మరచిపోయారా అని అడిగారు. మోడీ ఏమన్నా చేస్తారా..? తమాషాలు చేస్తున్నారా...? మోడీ సంగతి కూడా చూస్తా.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా అని అనలేదా అని గుర్తుచేశారు. అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేదిపై నోరు పారేసుకోలేదా అని అడిగారు. ఇప్పుడేమో శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications