పవన్ నాయుడు మళ్లీ యాక్టింగ్, ఒప్పందం మేరకేనా, మంత్రి పేర్ని నాని కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నాయుడే కేంద్ర ప్రభుత్వం అని ఏపీ మంత్రి విమర్శించారు. చంద్రబాబు సలహా మేరకు ఆయన బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారని ఆరోపించారు. ఉదయం షూటింగ్ చేస్తోన్న పవన్ కల్యాణ్, సాయంత్రం యాక్టింగ్ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కానీ కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ చెప్పిన అంశాన్ని మరచిపోయారని పేర్కొన్నారు.

సపోర్ట్ చేసి...

సపోర్ట్ చేసి...

ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇవాళ ఉదయం రాజధాని వికేంద్రీకరణకు జనసేన మద్దతు తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసు ఎలా మారిందో తెలియదన్నారు. సీఎం జగన్ అద్బుతంగా పాలిస్తే తాను నటిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారని.. కానీ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు.

ప్రజల ఆస్తి

ప్రజల ఆస్తి

పవన్ కల్యాణ్ ఇవాళ ఎందుకు తెరమీదకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రజల ఆస్తి అని.. అందుకే ఆయనను తాను పవన్ నాయుడు అని పిలుస్తానని మంత్రి సెటైర్లు వేశారు. ఇదివరకు బీజేపీని, మోడీని తిట్టిపోసిన పవన్ కల్యాణ్.. ఇవాళ చంద్రబాబు సలహామేరకు ఆ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

గురుతర బాధ్యత

గురుతర బాధ్యత

పవన్ కల్యాణ్‌కు ఎప్పుడెప్పుడూ.. సీఎం అయిపోవాలని ఉంది అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కానీ ఆయన పాలనాపరమైన పుస్తకాలు చదివితే బాగుంటుందని సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ పుస్తకాలు చదువుతుంటారని.. పరిపానలకు సంబంధించిన చదివితే బాగుంటుందని సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పును తాము సరిదిద్దామని మంత్రి పేర్ని స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+