వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి మూడో స్థానం: 'జగన్ ఇప్పుడేం చెప్తారు, దానిపై ఇప్పటి దాకా చెప్పలేదు'

నేషనల్ కౌన్సెల్ ఆఫ్ అప్పీల్డ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఏఈఆర్) సంస్థ సర్వేలో దేశంలోనే ఏపీకి మూడో స్థానం వచ్చిందని, ఇప్పుడు దీనిపై వైసిపి అధినేత జగన్ ఏం సమాధానం చెబుతారని యనమల సోమవారం ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నేషనల్ కౌన్సెల్ ఆఫ్ అప్పీల్డ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఏఈఆర్) సంస్థ సర్వేలో దేశంలోనే ఏపీకి మూడో స్థానం వచ్చిందని, ఇప్పుడు దీనిపై వైసిపి అధినేత జగన్ ఏం సమాధానం చెబుతారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ప్రశ్నించారు.

చదవండి: చంద్రబాబుకు షాకివ్వబోయి అడ్డంగా బుక్కైన వైసిపి కార్యకర్తలు!

గత ఏడాది ఇదే సంస్థ నివేదిక ఇచ్చినప్పుడు వైసిపి గగ్గోలు పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం వెనుకబడిపోతోందని ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు అదే సంస్థ ఇచ్చిన నివేదికలో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని యనమల చెప్పారు.

గుజరాత్, ఢిల్లీ తర్వాత..

గుజరాత్, ఢిల్లీ తర్వాత..

ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారని యనమల ప్రశ్నించారు. గుజరాత్, ఢిల్లీ తర్వాత ఏపీ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. వైసిపి అభివృద్ధి నిరోధక పార్టీ అని ధ్వజమెత్తారు.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
గవర్నర్‌ను ఎందుకు కలిశారో ఇప్పటి దాకా చెప్పలేదు

గవర్నర్‌ను ఎందుకు కలిశారో ఇప్పటి దాకా చెప్పలేదు

తనపై ఉన్న అక్రమాస్తుల కేసులన్నింటినీ ఒకేసారి విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జగన్ ఉపసంహరించుకున్న తర్వాత గవర్నర్ నరసింహన్‌ను ఆయన ఎందుకు కలిశారో ఇప్పటి దాకా చెప్పలేదని మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు.

ఎందుకు కలవాల్సి వచ్చింది?

ఎందుకు కలవాల్సి వచ్చింది?

దీనిపై ఇంతవరకూ వివరణ ఇవ్వకపోవడంపై దేవినేని విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను ఎందుకు కలిశాను, ఎందుకు కలవాల్సి వచ్చింది.. ఏ విషయమై విన్నవించుకున్నాననే దానిపై జగన్ ఇంతవరకూ నోరు తెరవలేదంటే, ఆ పార్టీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థమౌతోందన్నారు.

సమాధానం చెప్పండి

సమాధానం చెప్పండి

కేవీపీ రామచంద్రరావును, జగన్‌ను తాను ఒకటే అడుగుతున్నానని, 2009, 2013లో పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలని దేవినేని నిలదీశారు. సుమారు 13 సీబీఐ కేసుల్లో జగన్ ఎ1 ముద్దాయి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు అడ్డం పడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎ2 ముద్దాయి అన్నారు. వీళ్లందరి లక్ష్యం కూడా పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డం పడటమే అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా చూడాలనేదే వారి ఉద్దేశ్యమన్నారు.

English summary
A new report put up by NCAER ranks Andhra Pradesh in 13th Position in Corruption. That’s a stark improvement in two years time. The other Telugu State, Telangana is ranked 12th. With that, Jagan has lost a weapon to attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X