APPSC Group1: గ్రూప్ 1 పరీక్షపై మంత్రి లోకేష్ కు మరో మంత్రి లోకేష్ కీలక వినతి..!

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్ధుల ఎంపికకు సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కీలక విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్దులతో పాటు పలు వర్గాల నుంచి వినతులు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాళ వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

గ్రూప్-2 తరహాలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-1కు 1:100 విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని వైద్యమంత్రి సత్యకుమార్ యాదవ్ తన ట్వీట్ లో తెలిపారు. 2020 &2023 మెయిన్ పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వంలో పారదర్శకత లేకపోవడం, సిలబస్ పేరుతో గందరగోళం, గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మధ్య తక్కువ సమయం.. ప్రశ్నపత్రంలో అనువాద సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు.

ap minister satya kumar requests colleague nara Lokesh to change appsc group 1 exam selection

గత నోటిఫికేషన్ మరియు గ్రూప్ 2 తో పోలిస్తే తక్కువ పోస్టులు ఉన్నందున గ్రూప్-1 ఫలితాలకు 1:50 విధానాన్ని అమలు చేయడం వల్ల తెలుగు మాధ్యమం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగడానికి ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకుని గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యకు సానుకూలమైన పరిష్కారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలించగలరంటూ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+