బెజవాడ పాలిటిక్స్: ఉమకు కొడాలి వార్నింగ్.. సొంత వదిననే చంపించారు: ఖ‌బ‌డ్దార్‌..!

మాజీ మంత్రి దేవినేని ఉమ మీద ప్ర‌స్తుత మంత్రులు ఫైర్ అయ్యారు. హెచ్చ‌రిక‌లు చేసారు. నోరు అదుపులో పెట్టుకో మ‌ని వార్నింగ్‌లు ఇచ్చారు. ముఖ్య‌మంత్రిని ఏక‌వ‌చ‌నంతో పిలిస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ రోజు నుండి జ‌గ‌న్ గురించి మాట్లాడు..రేపే చూస్తావు .. ఏం జ‌రుగుతుందో అంటూ మందుస్తు హెచ్చ‌రిక చేసారు. మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని ఇద్ద‌రూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..దేవినేని ఉమా అవినీతి గురించి మాట్లాడారు. కొడాలి నాని సొంద వ‌దిన‌ను దేవినేని ఉమా చంపించారంటూ ఆరోపించారు. మ‌చిలీప‌ట్నం పోర్టు కేసీఆర్‌కు అప్ప‌గిస్తున్నారంటూ టీడీపీ నేత‌లు చేస్తున్న ప్రచారం గురించి స్పందించిన ఆయ‌న జీవోను చూపించారు.

 దేవినేని ఉమా పైన ఘాటు విమర్శ‌లు..

దేవినేని ఉమా పైన ఘాటు విమర్శ‌లు..

మాజీ మంత్రి దేవినేని ఉమా కొద్ది రోజులుగా పోల‌వ‌రం అంశం గురించి ముఖ్య‌మంత్రి మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా రు. దీనికి ప్ర‌తిగా మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని స్పందించారు. ఉమా అవినీతి ప‌రుడ‌ని..పోల‌వ‌రంలో రెండు వేల కోట్ల రూపాయ‌ల మేర అవినీతి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. మంత్రి కొడాలి నాని దేవినేని ఉమా పైన ఘాటు విమర్శ లు చేశారు. సొంత వదిననే చంపించిన దేవినేని ఉమ తమపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం జగన్ ను ఇకపై ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, పోల వరం కాంట్రాక్ట‌ర్ల‌కు ట్రాన్స్‌ట్రాయ్‌, నవయుగ సంస్థతో కుమ్మక్కై రేట్లు పెంచేసి వాటాలు పంచుకున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమను చెంచాగా పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రాజెక్టులో అడ్డంగా దోచుకున్నారన్నారు. దోపిడీని అరికట్టేందు కు సీఎం జగన్ ప్రయత్నం చేస్తుంటే దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంద‌రు పోర్టు జీవో అనేది అబద్దం..

బంద‌రు పోర్టు జీవో అనేది అబద్దం..

మ‌రో మంత్రి పేర్ని నాని సైతం చంద్ర‌బాబు..దేవినేని ఉమా..కొల్లు రవీంద్ర మీద ఫైర్ అయ్యారు. ఒక జీవో నెంబ‌రు చప్పి బంద‌రు పోర్టును తెలంగాణ‌కు అప్ప‌గిస్తున్నారంటూ అబ‌ద్దాల‌తో రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆ జీవోను మీడియా స‌మావేశంలో విడుద‌ల చేసారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బందరు పోర్టు గురించి చంద్ర‌బాబు ఎన్ను మాట‌లు చెప్పార‌ని..అక్క‌డ ఒక ఇటుక కూడా ప‌డ‌లేద‌ని వివ‌రించారు. పోల‌వ‌రంలో రెండు వేల కోట్ల మేర అవినీతి జ‌రిగితే..దీనిని అడ్డుకొనేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వివ‌రించారు.

నోరు అదుపులో పెట్టుకోవాల‌ని

నోరు అదుపులో పెట్టుకోవాల‌ని

మాజీ మంత్రి ఉమా త‌న నోరు అదుపులో పెట్టుకోవాల‌ని సూచించారు. ఏరా..ఉమా అని మేము అన‌గ‌ల‌మ‌ని..అయితే సంస్కారం అడ్డు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో రాజ‌కీయంగా ఎద‌గటం కోస‌మే బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వివ‌రించారు. పోల‌వ‌రంలో సొంత వ్య‌క్తుల‌కు టెండ‌ర్లు క‌ట్ట‌బెట్ట‌టానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌ను మంత్రి పేర్ని నాని ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+