Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాట తప్పని నాయకుడు - మాట తప్పిన పార్టీ..!!

ముఖ్యమంత్రిగా జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనలో ఏ విధంగా సామాజిక న్యాయం చేశారన్నది ప్రజలు తెలియజేప్పేందుకు బస్సు యాత్రను ప్రారంభించామని చెప్పారు మంత్రి బొత్సా. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడం, వంచించడం తమకు అలవాటు లేదని చెప్పుకొచ్చారు.చంద్రబాబు ఎన్ని లేఖలైనా రాసుకోవచ్చు అని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు రిమాండుకు పంపిందని, ప్రభుత్వం ఆయనకు శిక్ష వేయలేదన్నారు.

చంద్రబాబు మోసం చేసారు
గణపతినగరంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభించారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామని మంత్రులు చెప్పుకొచ్చారు.మొదటి రోజు బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.

AP Ministers lashe out on Chandra Babu, says Govt stands for poor at Vizianagaram

2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశారని, ఆయన నయవంచకుడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సామాజిక న్యాయం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం ఎలా వాగ్ధానాలు చేసిందో అందరికీ తెలుసు అన్నారు. 600 వాగ్ధానాలు వారి మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేసారు.

మాట నిలబెట్టుకొనేలా
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారన్నారు. బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారిందని విమర్శించారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన జగన్‌ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తూచ తప్పకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన జగన్‌ విధానమని వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరామన్నారు.

సీఎం జగన్‌ అందించిన సంక్షేమ పథకాలను సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. జరిగిన అభివృద్ధిని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ నెరవేర్చారని చెప్పారు.

అన్ని వర్గాలకు న్యాయం
సీఎం జగన్‌ పాలనలో సామాజిక విప్లవం విరాజిల్లుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అన్ని వర్గాలకూ న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమే అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికీ వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. సంక్షేమ పాలనను అందిస్తున్న జగన్‌ కి ప్రజలు అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు.

పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. రూ.2.83 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కి జమ చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ చేసిన పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక అందరికీ మేలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+