సినిమా..నిత్యావసర వస్తువు: ఫిల్మ్ ఇండస్ట్రీ గోడును పట్టించుకోవాలి..సహకరించాలి: బాలకృష్ణ
అమరావతి: ఇవ్వాళ మనిషి తన దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి.. కనీస వినోదాన్ని కూడా నోచుకోలేకపోతున్నాడని ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సగటు మనిషి తన నిత్యావసరాల్లో సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడని చెప్పారు. సినిమా అనేది ఇవ్వాళ నిత్యావసర వస్తువుగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి సినిమా ఎలా ఉండాలి.. చిత్ర పరిశ్రమ ఇంకెంత బాగుండాలి? అంటూ ప్రశ్నలను సంధించారు.
అఖండ సంక్రాంతి సంబరాలు..
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం- అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అఘోరీగా నటించిన బాలకృష్ణను అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. విడుదలైన ప్రతి చోట కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టుకుంది. విడుదల వారం రోజుల్లోపే 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన సినిమా జాబితాలోకి చేరిందీ అఖండ. కమర్షియల్ అంశాలకు హిందూయిజాన్ని జోడించి ఎలివేట్ చేసిన మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.
కనీస వినోదం లేకపోతే ఎలా..
తాజాగా అఖండ చిత్రం యూనిట్- సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అఖండ సంక్రాంతి సంబరాలు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రామానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ పలువురు నటీనటులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తన అభిప్రాయాలను బయట పెట్టారు. సినిమా అనే కనీస వినోదాన్ని కూడా దక్కని విధంగా ప్రభుత్వాలు పని చేస్తోన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గోడును పట్టించుకునే వారు లేరంటూ వాపోయారు.

ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలి..
ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల నియంత్రణ, మూవీ థియేటర్లపై దాడుల విషయంలో చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కలిసికట్టుగా ఎదుర్కొనాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామనీ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్దాయని, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకునే వారిలో తాను ముందంజలో ఉంటానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాల సహకారం ఎప్పుడూ అవసరం..
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని, మూడు పువ్వులు-ఆరు కాయలుగా ఇండస్ట్రీ వర్ధిల్లాలని అన్నారు. చిన్న, పెద్ద సినిమాలనే తేడా ఏదీ లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. భారీ కలెక్షన్లను సాధించిన సినిమాను పెద్ద మూవీగా చెప్పుకొంటారని చెప్పుకొచ్చారు. అఖండ పాపులారిటీ పాకిస్తాన్ వరకూ పాకిందని బాలకృష్ణ అన్నారు. అఖండ అనేది ఓ మామూలు సినిమా కాదని.. పేరుకు తగ్గట్టుగా అఖండమైనదని చెప్పారు.

అఖండ ఓ టానిక్..
ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈ పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలైందని, భారీ కలెక్షన్లను రాబట్టుకుందని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఒక టానిక్‌లా పని చేసిందని అన్నారు. తాను ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించానని, అలా సాహసం చేసిన ప్రతీసారీ ప్రేక్షకులు ఆదరించారని బాలకృష్ణ చెప్పారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications