షాక్: అఖిల సంతకం ఫోర్జరీ, మంత్రికే సిఫారసు లేఖ
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకే షాకిచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. మంత్రి అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెకే సిఫారసు లేఖను పంపాడు. మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేసి సిఫారసు లేఖలను తయారు చేశాడు గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ వ్యక్తి సిఫారసు లేఖలను తయారు చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా అఖిలప్రియ సంతకాన్నే ఓ లేఖ మీద ఫోర్జరీ చేసి, అంతటితో ఆగకుండా దానిని మంత్రి అఖిలకే అందజేశాడు.

ఈ లేఖను చూసిన మంత్రి అవాక్కయ్యారు. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలంటూ మంత్రి అఖిలప్రియ సిఫారసు చేసినట్లు ఆమె సంతకం ఫోర్జరీ చేసి ఉన్న లేఖ వచ్చినట్లు మంత్రి పేషీ సిబ్బంది ఎస్పీఎఫ్ కి ఫిర్యాదు చేశారు.
పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ పరిణామం మంత్రి పేషీలో కలకలం రేపింది.
కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.తాను ఎవరికీ సిఫారసు లేఖలు ఇవ్వలేదన్న మంత్రి భూమా అఖిలప్రియ.












Click it and Unblock the Notifications