ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు?, బాబు ఏకాకి!
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేందుకు అవసరమైన ఆధారాల సేకరణలో ఏపీ పోలీసులు ఉన్నట్లుగా సమాచారం. తమ వద్ద చంద్రబాబు ఆడియో టేపులు ఉన్నాయని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు.
అవి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయని, ట్యాపింగ్ జరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఇప్పటికే కేంద్ర హోం, టెలికం మంత్రిత్వ శాఖలకు నివేదించినట్లుగా తెలుస్తోంది. ఫోను ట్యాపింగ్ జరగకపోతే సంబంధిత ఆడియో టేపులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలనే అంశం అవసరమైతే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఏకాకి అయ్యారని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. జోక్యం చేసుకోవడానికి కేంద్రం కూడా విముఖత చూపిందని, బయటపడేయాలని సొంత పోలీసుల పైన చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని రాసింది. ఏపీ పోలీసులు చేతులెత్తేస్తున్నారని పేర్కొంది.
మరోవైపు, చంద్రబాబు రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అయితే, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేందుకు అవసరమైన ఆధారాల సేకరణలో ఏపీ పోలీసులు ఉన్నట్లుగా సమాచారం.

కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే గద్దె దిగాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద సోమవారం ధర్నా చేసింది.

కాంగ్రెస్
చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు వ్యవహారంలో తన నిజాయితీని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

కాంగ్రెస్
కాగా, ధర్నా కార్యక్రమంలో స్విస్ ఛాలెంజిలో రాజధాని పనులు, టీడీపీ పెద్దలకు కాసుల మూటలు అంటూ ఫ్లెక్సీలు పెట్టిన కాంగ్రెస్.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications