కాన్వాయ్ లోకి 19ఫార్చ్యూనర్లు
ఏపీ పోలీసులు కొత్తగా 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను కొనుగోలు చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) అధికారులు వీటిని పరీక్షించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 17 వాహనాలు నలుపు రంగు కాగా, 2 వాహనాలు తెలుపు రంగలో ఉన్నాయి. వీవీఐపీల భద్రత కోసం వీటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యమైనవారందరికీ వీటిని సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ 6 ఫార్చ్యూనర్ వాహనాలు వినియోగిస్తున్నారు. మంత్రులు కూడా కొందరు వాడుతున్నారు. ఈ 19 ఫార్చ్యూనర్లను బుల్లెట్ ప్రూఫ్ గా మార్చిన తర్వాత ముఖ్యమంత్రికి, పలువురు మంత్రులకు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం హై ఎండ్ టయోటా ఫార్చ్యూనర్ డీజీల్ వెర్షన్ ధర రూ.63 లక్షలు. అదే పెట్రోల్ వెర్షన్ అయితే రూ.43 లక్షలు. సాధారణంగా వీవీపీఐల కోసం అత్యాధునిక హై ఎండ్ వాహనాలనే ఎప్పుడూ కొనుగోలు చేస్తారు. వీటికి రూ.11.97 కోట్లు ఖర్చవగా వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చడానికి సుమారు రూ.20 లక్షల వరకూ ఖర్చవుతుందని, మొత్తం రూ.3.80 కోట్లవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ వాహనాలపై రూ.15.77 కోట్లు వ్యయం చేసినట్లవుతుంది.

పవన్ కల్యాణ్ బస్సు యాత్ర, నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రజల మధ్యకు రావాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. మార్చి నుంచి జగన్ కూడా యాత్రలకు సిద్ధపడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో భద్రత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు కొత్త వాహనాలను కొనుగోలుచేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా మారుస్తున్నారు. పనులన్నీ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ వింగ్ అధికారులు ఎవరెవరికి భద్రత అవసరమవుతుందో అంచనా వేసి ఆ ప్రకారం వాటిని కేటాయించనున్నారు.












Click it and Unblock the Notifications