గుడ్ న్యూస్: ఏపీ పోలీస్ శాఖలో 6,500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్: హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కారు ఇకపై వినూత్న విధానాన్ని అవలంభించనుంది. ఉద్యోగాల నోటిఫికేష్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, నిర్దిష్టంగా జనవరి నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే 2021 ఏడాదికి సంబంధించి మొత్తం 6, 500 పోస్టులకుగానూ జనవరిలో నోటిఫికేషన్ రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఏపీ పోలీస్ విభాగంలో మరోసారి కొలువుల జాతరకు తెరలేవనుంది.

హోంమంత్రి ప్రకటన..

హోంమంత్రి ప్రకటన..


రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి 2021 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం రాత్రి వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆమె చెప్పారు. ఇకపై ప్రతి ఏటా జనవరి నెలలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేశారు. నిజానికి..

రిక్రూట్మెంట్స్ క్యాలెండర్

రిక్రూట్మెంట్స్ క్యాలెండర్


పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని ఇటీవల సీఎం జగన్ వెల్లడించారు. మిగతా అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అందజేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖతోపాటే అన్ని శాఖల ఉద్యోగాలకు ప్రతి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు పూర్తిచేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Recommended Video

    Tirupati LokSabha Bypoll | Oneindia Telugu
    ఏపీ పోలీస్ శాఖలో భారీగా..

    ఏపీ పోలీస్ శాఖలో భారీగా..

    ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 2019 నవంబర్ నాటికి 340 ఎస్సై, 11,356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని పోలీసు నియామక మండలి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు నియామక మండలి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ల విడుదలకు సరేనన్న ప్రభుత్వం.. తాజాగా వాటి గడువును కూడా ప్రకటించడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+