'మరో నెల రోజుల్లో స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్‌కు అప్పగిస్తాం'
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ఉన్నతాధికారుల బృందంతో శుక్రవారం రాయలసీ ఐజీ భేటీ అయ్యారు
ఆంధ్రప్రదేశ్‌లో గంగిరెడ్డిపై నమోదైన కేసులు, వాటి తీవ్రతను మారిషస్ అటార్నీ జనరల్‌కు ఐజీ వివరించారు. అంతేకాకుండా, కేసుల పత్రాలను కూడా మారిషస్ ఉన్నతాధికారుల బృందానికి అప్పగించి గంగిరెడ్డిని తమకు అప్పగించాలని కోరారు.
దీనిపై స్పందించిన మారిషస్ బృందం గంగిరెడ్డిని నెలరోజుల్లోగా అప్పగిస్తామని ఏపీ పోలీసులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మారిషస్ జైల్లో ఉన్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను మారిషస్ కోర్టు మూడు సార్లు తిరిస్కరించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మారిషస్‌లో ఫిబ్రవరి చివరి వారంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.
కాగా, గంగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఆస్తులపై కూడా ఈడీ ఆరా తీసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో గంగరెడ్డి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. దేశవిదేశాల్లో స్మగ్లర్ గంగిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ ఈడీకి అందజేసింది. అతని ఆస్తులు జఫ్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications