ఒక్క రోజే గడువు : కేసీఆర్ నోరు విప్పుతారా..జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా:ప‌ది ల‌క్ష‌ల ఓట్ల పై ప్ర‌భావం

Recommended Video

    AP Assembly Election 2019 : కేసీఆర్ నోరు విప్పుతారా... జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా || Oneindia Telugu

    ఏపి రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోరు విప్పుతారా. చంద్ర‌బాబు..వ‌ప‌న్ ఆరోప‌ణ‌ల పై స మాధానం చెబుతారా. జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా. ఏపి హోదా విష‌యంలో కేసీఆర్ ఓ క్లారిటీ ప్ర‌చారం చివ‌రి రోజున ఇవ్వ బోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగి..హోదా పై కేసీఆర్ సానుకూల వ్యాఖ్య‌లు చేస్తే బాబు..ప‌వ‌న్ ఇప్ప‌టి దాకా చేసిన ప్ర‌చారానికి మొత్తంగా విలువ లేకుండా పోతుంద‌ని అంచ‌నా. ఏం జ‌ర‌గ‌బోతోంది...

    కేసీఆర్ భుజం తుపాకి పెట్టి జ‌గ‌న్ ల‌క్ష్యంగా..

    కేసీఆర్ భుజం తుపాకి పెట్టి జ‌గ‌న్ ల‌క్ష్యంగా..

    ఎన్నిక‌ల ప్ర‌చారంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు తొలి నుండి కేసీఆర్‌..మోదీ లక్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు గుప్పిస్తు న్నారు. అదే స‌మ‌యంలో ఏపికి ద్రోహులు అయిన కేసీఆర్..మోదీ తో క‌లిసిన జ‌గ‌న్ కు ఓటు వేస్తే ఆ ఇద్ద‌రికీ ఓటు వేసి న‌ట్లే అంటూ ప్ర‌చారం చేసారు. ఇక ఏపికి ప్ర‌త్యేక హోదా కు కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని జ‌గ‌న్ చెప్పటాన్ని కూడా ముఖ్య‌మంత్రి త‌ప్పు బట్టారు. కేసీఆర్ ఏపికి హోదా కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ చెవిలో చెప్పారా..అంటూ ప్ర‌శ్నించారు . దాదాపు 20 రోజులుగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని చంద్ర‌బాబు త‌న ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు ..స‌వాళ్ల తో ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల పై స్పందించ‌లేదు. తాను స్పందిస్తే దానిని చంద్ర‌బాబు మ‌రింత‌గా త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకొనే అవ‌కాశం ఉంద‌నే కార‌ణంతోనే స్పందించ‌లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగింపు ద‌శ‌కు చేరుకుంది.

    కేసీఆర్ హోదా పై స్పందిస్తారా..

    కేసీఆర్ హోదా పై స్పందిస్తారా..

    తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోనియా..రాహుల్ ఇద్ద‌రూ ఏపికి ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క టించారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తెలంగాణ‌కు సైతం హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేసారు. ఇక‌, ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత జ‌రిగిన మీడియా స‌మావేశంలో తాను ఏపికి ప్ర‌త్యేక హోదా కు వ్య‌తిరేకం కాద‌ని..తానే కేంద్రానికి లేఖ రాస్తా న‌ని స్ప‌ష్టం చేసారు. టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాము ఏపికి ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకం కాద‌ని లోక్‌స‌భ లో క‌విత సైతం ఏపికి హోదాకు మ‌ద్ద‌తు ప్ర‌కటించార‌ని గుర్తు చేసారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న ప్ర‌చారం లో కేసీఆర్ పోల‌వ‌రానికి అడ్డుప‌డుతున్నార‌ని..ముచ్చుమ‌ర్రి వంటి వాటిని ఆపివేయాల‌ని కోరుతున్నార‌ని చెబుతున్నారు. వీటి పై జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. ఇది ప్రజ‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. కేసీఆర్ అక్క‌డ కూడా లోక్‌స‌భ ఎన్నిక‌లు ఉండ‌టంతో ఇప్పుడు కేసీఆర్ ఏపికి హోదా కు అనుకూలంగా మాట్లాడ లేర‌న్న‌ది టిడిపి నేత‌ల భావ‌న‌.

    కేసీఆర్ స్పష్టం చేస్తారు..

    కేసీఆర్ స్పష్టం చేస్తారు..

    ఇక‌, హైద‌రాబాద్ లో ఉన్న ఏపి ఓట‌ర్లు దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది ఏపిలో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకొనేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. వీరి పై టిడిపి అధినేత చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల ప్ర‌భావం ఉంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపి వారి పై దాడులు జ‌రుగుతున్నాయంటూ తొలుత ప్ర‌చారం చేసినా..ఆ త‌రువాత ఆ అంశాన్ని ఎత్త‌టం లేదు. ఇక‌, ఒక రోజు మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారానికి స‌మ‌యం ఉండ‌టంతో కేసీఆర్ స్పందిస్తార‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తు న్నారు. మిగిలిన విష‌యాల పై కాక పోయినా..ఏపికి హోదా విష‌యంలో త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కేసీఆర్ చెబితే చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌చారానికి విలువ లేకుండా పోతుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి, కేసీఆర్ 11వ తేదీ లోగా ఏపికి ప్ర‌త్యేక హోదా పై స్పందిస్తారా లేదా ఇప్పుడు ఆసక్తి క‌రంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+