ap polycet 2023 results : ఏపీ పాలిసెట్ ఫలితాల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాల్ని విడుదల చేశారు. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఈ ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాశారు. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో డిప్లమో కోసం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఈ ఏడాది ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 1.6 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1.43 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. అంటే 89 శాతం మంది పరీక్ష రాశారు. వీరిలో 86.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి కౌన్సిలింగ్ విధానంలో సీట్లు కేటాయిస్తారు. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.

మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్దులకు పాలిసెట్ అర్హత కల్పిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు మూడేళ్లు, మూడున్నరేళ్ల కాల వ్యవధి గల కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్ లోసాధించిన స్కోరు ఆధారంగా కాలేజీల్లో ప్రవేశాలు ఉంటాయి. పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 84 ప్రభుత్వ కాలేజీల్లో, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి.
పాలిసెట్ ఫలితాలను పలు వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications