ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల: ముగ్గురికీ మొదటి ర్యాంక్
విశాఖపట్నం: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్-2018 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.
ఏప్రిల్ 12న పాలీసెట్ నిర్వహించగా.. ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ పరీక్షను 1,29,412 మంది విద్యార్థులు రాయగా.. 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.

కాగా, ఈ పరీక్షల్లో ముగ్గురికి కూడా మొదటి ర్యాంకు కావడం గమనార్హం. చిట్‌నీడి గీతా సౌజన్య(తూర్పుగోదావరి), కంకటాల శ్రీహర్ష(తూర్పుగోదావరి), ( పిల్లి శ్రీకర్ బాబు(పశ్చిమగోదావరి)లు మొదటి ర్యాంక్ సాధించారు.
కేశారపు సూర్య వెంకట్(తూర్పుగోదావరి)-నాలుగో ర్యాంక్, పాకా అఖిల్ చంద్(పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్, ఆకుల హేమంత్( పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్,
మట్టా వేద సంహిత్(పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్, కాగడాల రాజా( శ్రీకాకుళం జిల్లా)-ఎనిమిదో ర్యాంక్, ఉట్ల సాయి సుస్మితశ్రీ(తూర్పుగోదావరి)-ఎనిమిదో ర్యాంక్, చిలుకూరి విష్ణు తేజారెడ్డి(పశ్చిమగోదావరి)-ఎనిమిదో ర్యాంక్ సాధించారు.












Click it and Unblock the Notifications