పవర్ కట్ ఎఫెక్ట్: ఫ్రెండ్స్ ఇచ్చిన గిప్ట్‌కు కపుల్ షాక్.. ఇంతకీ అందులో ఏముందంటే..?
ఇప్పుడు వేసవి.. ఇంకేముంది పవర్ కచ్చితంగా కావాల్సిందే. విద్యుత్ కోత విధిస్తే అంతే సంగతులు.. అవును పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కరెంట్ కావాల్సిందే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సో.. విద్యుత్ మ్యాండేటరీ.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోతలు తప్పడం లేదు. పరిశ్రమలకు అయితే ఏకంగా పవర్ హాలీడే ప్రకటించేశారు. విద్యుత్ కోతలతో ఏపీ అల్లాడుతోంది. ఈ క్రమంలో ఓ జంటకు స్నేహితులు మంచి గిప్ట్ ఇచ్చేశారు. దానిని చూసి అక్కడ నవ్వులు పూశాయి. అదేంటో మీరు చూడండి.

ఏం గిప్టురా నాయనా..?
జీవితంలో జరిగే ముఖ్య ఘట్టం పెళ్లి.. మ్యారేజ్‌కు ఫ్యామిలీ, రిలేషన్స్ కాక.. ఫ్రెండ్స్ వచ్చి గిప్ట్ ఇచ్చేస్తారు. ఇంకేముంది... అలా ఏపీలో ఓ జంటకు పెళ్లయ్యింది. ఫ్రెండ్స్ వచ్చారు. ఏదో గిప్ట్ తీసుకొచ్చారు. మాములుగా అయితే ఆ బహుమతి అందరూ వెళ్లిపోయాక ఓపెన్ చేస్తారు. మరీ ఇక్కడ కెమెరా ముందే ఓపెన్ చేశారు. దట్ టు.. ఆ గిప్ట్ ఏంటీ అని వెనకాల నుంచి కామెంట్ వచ్చాయి. అలా గిప్ట్.. కష్టపడి మరీ ఓపెన్ చేశారు. తర్వాత అంతా కలిసి నవ్వేశారు. ఇంతకీ అందులో ఏముందంటే.. విసనకర్ర.. రెండు కర్రలు పెట్టి ప్యాక్ చేయించారు.

తప్పని కోతలు.. జంటకు గిప్ట్
రాష్ట్రంలో కరెంట్ కోత ఉన్నందున ఇండైరెక్టుగా చెప్పేశారు. కొత్త జంటకు ఫ్యాన్, కూలర్లు ఉండవు.. సో విసనకర్రతో ఊపుకోవాలని సింబాలిక్‌గా చెప్పారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. మీరు ఒకరికొకరు ఊపుకోవాలని ఒకరు సజెస్ట్ చేశారు. అసలే వేసవి కావడంతో.. కొత్త కపుల్ ఈ ఎండలకు ఎలా ఉంటారని చెప్పారు. అందుకే నలుగురు కలిసి విసనకర్రలు కొనిచ్చారు. కానీ దానిని మంచి ప్యాక్ చేయించారు. అందరిముందే విప్పేసి.. పవర్ కట్ ఉంది కనుక.. అవసరం ఉంటున్నందున ఇస్తున్నామని వివరించారు.

ఒకరికొకరు ఊపుకొండి..
అలా ఇచ్చిన గిప్ట్ ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసింది. కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకేమేంది ఒకరికొకరు ఊపుకోవాలని సజెషన్ చేస్తున్నారు. కరెంట్ కోతలు ఎలాగూ తప్పవు.. మరీ ముందే రెడీ అయిపోతే పోలా అని అంటున్నారు.
సో స్నేహితులు ఇచ్చిన గిప్ట్ నిజంగా మిగతావారిని ఆలోచింపజేసింది. సో ప్రభుత్వానికి కనువిప్పు కలుగాలని కొందరు అంటున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరెంట్ ఎలా ఇస్తున్నారు.. ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని అడుగుతున్నారు. ఇక పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించడంపై భగ్గుమన్నారు.












Click it and Unblock the Notifications