రెండో'సారీ' షాక్: దినేష్ రెడ్డికి క్యాట్‌లో చుక్కెదురు

సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి తన పదవిని పొడగించాలని దినేష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన క్యాట్ దినేష్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కాగా, డిజిపిగా దినేష్ రెడ్డిని మరికొంతకాలం పొడిగించలేమని గురువారం క్యాట్‌కు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని దినేష్ రెడ్డి నిన్న మరోసారి సవాల్ చేశారు. దీనిని మళ్లీ విచారించిన క్యాట్ ఆయన పిటిషన్ తోసిపుచ్చింది.
దినేష్ రెడ్డి పదవి కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. తదుపరి అవకాశం ప్రసాద రావుకు వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఎపిఎన్జీవోలపై వాదనలు పూర్తి
ఎపిఎన్జీవోల సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో శక్రవారం వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.












Click it and Unblock the Notifications