AP SIR: గడువులోగా పూర్తి కాని 'సర్'- ఈసీకి సీఈవో కీలక లేఖ..!

ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ ఇంకా ఓటర్ల జాబితాల సవరణ పూర్తి కాలేదు. ఇంకా పలుచోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకపోవడం, ఇచ్చినా బీఎల్వోలు తిరిగి తీసుకోకపోవడం, తీసుకున్నా ఆ వివరాల డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఈ ప్రక్రియ పొడిగించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

SIR లో పేరు లేకపోతే పాస్ పోర్టు కూడా..! తేల్చేసిన కలకత్తా హైకోర్టు...!
SIR లో పేరు లేకపోతే పాస్ పోర్టు కూడా..! తేల్చేసిన కలకత్తా హైకోర్టు...!

దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. అలాగే SIR గడువు పొడిగించాలని లేఖలో కోరారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఐఆర్ లో లోపాలపై విపక్ష వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

AP SIR Chief Electoral Officer Urges EC to Extend Deadline Following Parties Requests
SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!
SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 88 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని వివేక్ యాదవ్ తెలిపారు.4 కోట్ల 16 లక్షల 26 వేల 144 ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తి చేశామని, అలాగే 3 కోట్ల 69 లక్షల 50 వేల 812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఆయన లేఖలో తెలిపారు. పెండింగ్‌లో 1.67 శాతం ఎన్యుమరేషన్‌ ఫామ్స్ ఉన్నట్లు వెల్లడించారు. 14 లక్షల 19 వేల 644 మంది ఓటర్లు చనిపోయినట్టు గుర్తించామని సీఈవో పేర్కొన్నారు. పర్మినెంట్‌గా షిఫ్ట్ అయిన ఓటర్లు 12 లక్షల14 వేల 994 మంది ఉన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+