బీఎల్వో SIR ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేదా ? ఇలా చేయండి చాలు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచే బూత్ లెవెల్ అధికారులు (BLO) ఓటర్ల వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. వాటిలో వివరాలు నింపిన తర్వాత తిరిగి సేకరిస్తున్నారు. ఆ డేటాను కంప్యూటర్లలో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇంకా చాలా మందికి బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వలేదనే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.

SIR: బీఎల్వోల కోసం ఎదురుచూడొద్దు..! ఏపీ ఓటర్లకు ఈసీ కీలక సూచన..!
SIR: బీఎల్వోల కోసం ఎదురుచూడొద్దు..! ఏపీ ఓటర్లకు ఈసీ కీలక సూచన..!

దీనికి పలు చోట్ల బీఎల్వోల అలసత్వం కారణం కాగా, మరికొన్ని చోట్ల ఓటర్లు, వారి అడ్రస్ లు అందుబాటులో లేకపోవడం మరో కారణం. అయితే ఇలా ఏదైనా కారణంతో బీఎల్వోలు మీ ఇంటికి రాకపోతే, అలాగే ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకపోతే కంగారు పడకుండా ఏం చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవడానికి మీరు అందుబాటులో లేకపోతే సాధారణంగా మీ కుటుంబ సభ్యులకు బీఎల్వోలు అందజేస్తారు. అలా కూడా రాకపోతే ఏం చేయాలో ఈసీ సూచనలు చేసింది. వీటిని పాటించడం ద్వారా సులువుగా ఎన్యుమరేషన్ ఫారాల్ని బీఎల్వోలకు సమర్పించవచ్చు.

Did Not Receive SIR Enumeration Form from BLO Here Is What You Can Do
AP SIR: ఏపీలో 'సర్' పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!
AP SIR: ఏపీలో 'సర్' పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!

వీటిలో మొదటిది ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫాం బీఎల్వోలు తెచ్చి ఇవ్వకపోతే ఈసీ వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. http://voters.eci.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్ చేస్తే ఎన్యుమరేషన్ ఫారం లభిస్తుంది. దాన్ని నింపి తిరిగి అదే వెబ్ సైట్లో సమర్పించే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకు ఆధార్ కార్డులో, ఓటర్ కార్డులో ఉన్న పేర్లలో ఎలాంటి తేడా ఉండకూడదు. అలాగే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మొబైల్ నంబర్ కు లింక్ అయి ఉండాలి. ఎన్యుమరేషన్ ఫారం అందకపోతే బీఎల్వోలను ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇదే వెబ్ సైట్ లో వారి ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నంబర్ దొరక్కపోతే బుక్ యువర్ కాల్ విత్ బీఎల్వో అనే ఆప్షన్ కూడా ఉంది. అందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీ బీఎల్వో నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. అప్పుడు ఎన్యుమరేషన్ ఫారం తీసుకుని నింపి ఇవ్వవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+