సచివాలయం 2వబ్లాక్ వద్ద మోగిన అలారం: ఉద్యోగుల పరుగు, పోలీసులపై స్పీకర్ ఆగ్రహం
ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారమ్ మోగింది. దీంతో లోపల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.
అమరావతి: ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారమ్ మోగింది. దీంతో లోపల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.
కనీసం అరగంట పైగా ఏమి జరిగింది అనేది అంతుబట్టలేదు. మరో ప్రక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం తో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీ ని పోలీసులు పరిసిలిస్తున్నారు. చివరికి ఎవరో పొగ త్రాగడం వల్ల అలారమ్ మోగింది తేల్చిన పోలీసులు. దీనితో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులపై స్పీకర్ సీరియస్
అమరావతి: సెక్కూరిటీ పేరుతో ఓవర్ యాక్షన్ చేసిన గుంటూరు పోలీసులకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి వెళుతున్న మంత్రి కామినేని, ప్రభుత్వం విప్, నలుగురు ఎమ్మెల్యేల కార్లను పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీకి వెళ్లే దారి లేదంటూ మరో దారిలో వెళ్లాలని సూచించారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్‌మెన్‌లతో వాగ్వాదానికి దిగారు. దీంతో 15 నిముషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డుపైనే ఉండిపోయారు.
ఆ తర్వాత మరో మార్గంలో అసెంబ్లీకి చేరుకుని స్పీకర్‌కు పిర్యాదు చేశారు. దీంతో సభాపతి రూరల్ ఎస్పీ వెంకటప్పల నాయుడిని అసెంబ్లీకి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. మరోసారి ప్రజా ప్రతినిధులను అడ్డుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications