మోడీ కళ్లు తెరువు!: చిరంజీవి, జగన్ ఎఫెక్ట్... లోకసభలో టిడిపి నోటీసు
తిరుపతి/చెన్నై/ఢిల్లీ: ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయంలో కేంద్రం కళ్లు తెరవాలని ఎంపీ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నాడు అన్నారు. హోదా కోసం బలిదానం చేసుకున్న మునికోటి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం వారు తిరుపతికి తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోరారు.
ప్రత్యేక హోదాను ప్రకటించే అంశమై తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపీలు పార్లమెంటులో నోటీసు ఇచ్చారు. తిరుపతిలో హోదా కోసం మునికామ కోటి ఆత్మహత్య చేసుకోవడం, వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్న నేపథ్యంలో టిడిపి ఎంపీలు నోటీసులు ఇవ్వడం గమనార్హం. వైసిపి కూడా ప్రత్యేక హోదాపై చర్చకు సభలో పట్టుబడింది.
మరోవైపు, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షను ప్రారంభించారు. జగన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా కొనసాగుతుంది. ధర్నా వేదిక వద్దకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తిరుపతిలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికోటి ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
మునికోటి మృతికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు సోమవారం నాడు తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చాయి.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బందుకు మద్దతు తెలిపారు.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
అలాగే నగరంలోని విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. తిరుమలకు బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
కాంగ్రెస్, వామపక్షాల నేతలు జెండాలు పట్టుకొని తిరుపతి నగర వీధుల్లో ర్యాలీలు చేపడుతున్నారు. వెంటనే ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మునికోటి మృతి - ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటికి చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో వివిధ పార్టీల వారు కొవ్వత్తుల ర్యాలీతో సంతాపం వ్యక్తం చేశారు.

మునికోటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి.. సమైక్యాంధ్ర ఉద్యమంలోను పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications