ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల: ప్రకాశం ఫస్ట్, నెల్లూరు లాస్ట్

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాను ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు విశాఖపట్టణంలో విడుదల చేశారు.ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్థులయ్యారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 15 నుండి 29 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుమారు 6 లక్షల 13 వేల 378 మంది హజరయ్యారు. అయితే ఈ పరీక్షల్లో బాలురు 94.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు.

AP SSC Results 2018: Andhra Pradesh Education minister releases results

బాలికలు 94.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.రాష్ట్రంలోని 5343 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన అధికారులను అభినందించారు. గతేడాది కంటే ఈ ఏడాది ఫలితాలు ముందుగానే విడుదల చేసినట్లు చెప్పారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+