మోడీ మన్‌కీ బాత్ కాదు...ధోకా బాత్ అని మార్చండి:అనురాధ
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఆదివారం రేడియోలో ప్రసంగిస్తున్న మన్‌కీ బాత్‌ను ధోకా బాత్‌గా మార్చుకోవాలని టిడిపి నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. ప్రధాని తన మనసులో మాటలంటూ చెబుతున్నవి కేవలం మోసపు మాటలంటూ ఆమె మండిపడ్డారు.
సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. పార్లమెంట్‌లో సమావేశాలు జరగకుండా 14 రోజులుగా కార్యక్రమాలు నిలిచిపోయాయని, టిడిపి ఇచ్చిన అవిశ్వాసంపై ఎందుకు చర్చ జరపడం లేదని ఆమె ప్రశ్నించారు.

పట్టిసీమ కాంట్రాక్టర్‌కు సన్మానం చేయాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆనాడు మాట్లాడారని...ఇప్పుడు అదే ఎమ్మెల్యే అవినీతి జరిగిందని అంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...గుజరాత్ కాగ్ రిపోర్ట్‌పై చర్చకు సిద్ధమా?...అంటూ పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications