ఏపీ-టీలు కలవవు: బాబు ఆసక్తికర వ్యాఖ్య, సొరంగంలో గంటసేపు, వెంట వైద్యులు

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు తిరిగి కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. విభేదాల కోసం వెళ్తే వచ్చేదేమీ ఉండదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పరోక్షంగా హితవు పలికారు.

చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2016 సెప్టెంబర్ నాటికి వెలిగొండ తొలిదశ పనులు పూర్తవుతాయన్నారు. జిల్లాలో తొలి ప్రాధాన్యం వెలిగొండ ప్రాజెక్టుకే ఇస్తున్నామన్నారు.

వచ్చే ఏడాది వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల వద్ద నిద్రలో భాగంగా జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం ముందుగా ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

అనంతరం ప్రాజెక్టు నమూనాను, ఛాయా చిత్రాన్ని బాబు పరిశీలించారు. ప్రస్తుతం ప్రత్యేక వాహనంలో టన్నెల్-1లోనికి వెళ్లిన బాబు సుమారు గంట పాటు అక్కడే ఉండనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, శిద్ధా రాఘవ రావు తదితరులు ఉన్నారు.

టన్నెల్‌లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.

 AP, Telangana can resolve issues through dialogue, says Chandrababu

ముఖ్యమంత్రి వెంట టన్నెల్‌లోకి నలుగురు వైద్యుల బృందం వెళ్లడంతో పాటు టన్నెల్‌ బయట మరో డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. టన్నెల్‌లోకి నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ మొదటి వారంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు.

2016 సెప్టెంబర్‌ లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో గనులు, ఎర్రచందనాన్ని దోచుకున్నారని, రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టారన్నారు. కాంగ్రెస్‌ విధానాలతో రైతులు చితికిపోయారని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ చేస్తామని టీడీపీ ప్రకటిస్తే అది సాధ్యం కాదని కాంగ్రెస్‌ విమర్శించిందని, దాన్ని సవాల్‌గా తీసుకుని రుణమాఫీ చేసి చూపించామన్నారు. పేదలకు న్యాయం చేయడమే టీడీపీ విధానమన్నారు. పట్టిసీమపై జగన్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

ఉభయ గోదావరి జిల్లాల రైతులను రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. జగన్ కావాలనే పట్టిసీమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నీళ్లు లేకుండా కాలువలు తవ్వితే ఉపయోగం ఉండడని, రామలసీమ సమస్యలను పరిష్కరిస్తే వైసీపీకి మనుగడ ఉండదనే జగన్‌ భయపడుతున్నారన్నారు. ఇసుక మాఫియాను అరికట్టామని, నదుల అనుసంధానికి కృషి చేస్తామన్నారు.

రైతుల అపోహలను బ్యాంకులు తీర్చాలి: పత్తిపాటి

రుణమాఫీ అంశంపై మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం మాట్లాడుతూ... రైతుల అపోహలను బ్యాంకులు తీర్చితే ఎక్కడా సమస్యలు తలెత్తవన్నారు.

సాంకేతిక లోపాల కారణంగా కొందరు రైతుల రుణాలు మాఫీ కాలేదన్నారు. అలాంటివి పరిశీలిస్తున్నామన్నారు. గ్రామాల వారీగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను ఆయా గ్రామసభల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ వర్తిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+