నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీ, తెలంగాణ... 371డి నిబంధన నుంచి కేంద్రం మినహాయింపు
నీట్ జాతీయ పూల్‌లోకి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చినట్లు ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
ఢిల్లీ: నీట్ జాతీయ పూల్‌లోకి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చిందంటూ అందుకు ధన్యవాదాలు తెలిపారు.

నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీతోపాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ కూడా వచ్చాయన్నారు. వచ్చే ఏడాది (2018-19) నుంచి 371డి నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు లభించనుందని, జాతీయ పూల్‌లో చేరడంవల్ల వచ్చే ఏడాది నుంచి వైద్య సీట్లలో రాష్ట్ర విద్యార్ధులు ఎంబీబీఎస్, పీజీలో ఎక్కువ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం కలిసి వచ్చే అంశమని చెప్పారు.
దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఏపీలో 1900 సీట్లు ఉన్నాయని, రాష్ట్రం జాతీయ పూల్ కింద 15 శాతం సీట్లు (285) కోల్పోయినా జాతీయస్థాయిలో 16 రెట్లు అధికంగా(4482) సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తుందని వివరించారు.
అలాగే దేశవ్యాప్తంగా 13,872 పీజీ సీట్లు ఉండగా మన రాష్ట్రంలో 660 సీట్లు ఉన్నాయని, వీటిలో 50శాతం అంటే 330 జాతీయ పూల్‌కు ఇస్తే దేశవ్యాప్తంగా 7236 పీజీ సీట్లకు పోటీపడేందుకు అవకాశం ఉందన్నారు.
371డి నిబంధన మినహాయింపు, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధుల అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications