ఏపీ సచివాలయాల్లో బదిలీలపై విచారణ, రీకౌన్సిలింగ్.. ? కొత్త డిమాండ్లు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే జరుగుతున్న బదిలీలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సచివాలయాల ఉద్యోగులు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఇప్పటికే ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇవాళ మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
బదిలీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, రీ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇవాళ విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోనే అనేకచోట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జీవో 5ని పాటించకుండా అపారదర్శకంగా జరిగిందని ఆరోపించింది. కొన్నిచోట్ల అత్యంత పారదర్శకంగా జరిగిందని, మరికొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీనియార్టీలో ఉన్న ఉద్యోగులకు అన్యాయం చేశారని తెలిపింది.

అనేక జిల్లాలలో బదిలీలు జరిగే కౌన్సిలింగ్ కేంద్రాలలో సచివాలయ ఉద్యోగుల సీనియార్టీ జాబితా ప్రదర్శించకుండానే, కేవలం ఆప్షన్స్ మాత్రమే ఫామ్ ద్వారా స్వీకరించి, ఉద్యోగులను వెళ్ళమనడంతో ఉద్యోగులకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం కాలేదని తెలిపింది. అలాగే జీవో 5లో పేర్కొన్న విధంగా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు, కొన్ని కౌన్సిలింగ్ కేంద్రాల్లో ప్రాధాన్యత కల్పించి బదిలీలు చేపట్టలేదని తెలిపింది.

విజయవాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సిలింగ్ జరగకుండానే అన్యాయంగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన డైరెక్టర్ ఈ విషయాన్ని ఎన్టీఆర్ , కృషాణ జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం జరిగిన బదిలీల్లో, అన్యాయం జరిగిన ఉద్యోగులు నేరుగా సచివాలయాల శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక గ్రీవెన్స్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
-
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications