AP weather alert: రాగల మూడ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిమీ నుండి 4.5 కిమీ ఎత్తుల మధ్య కొనసాగుతుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది.

ఏపీలో రాగల మూడ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీలో రాగల మూడ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

శుక్రవారం షీర్ జోన్ 10°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తుల మధ్య ఏర్పడింది. దీంతో ఈ నెల 6న ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తరకోస్తాలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉత్తరకోస్తాలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దక్షిణ కోస్తాలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ కోస్తాలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ కోస్తా ఆంధ్రలో శుక్రవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

ఇక రాయలసీమలోనూ శుక్రవారం రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

శని, ఆదివారాల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొద్ది గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వర్ష బీభత్సంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా, మరో మూడు నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+