weather:ఏపీలో మరో 3 రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు, అల్పపీడనం ప్రభావమే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
కాగా, బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రాలో సోమవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. మంగళవారం కూడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బుధవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రాలో సోమవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
మరోవైపు, రాయలసీమలోనూ సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలుచాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. .












Click it and Unblock the Notifications