వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ వెదర్ అలర్ట్: రానున్న మూడు రోజులపాటు తీవ్ర చలి గాలులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరికొద్ది రోజులపాటు కూడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా దక్షిణ అండమాన్ ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణి మరో రెండు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది.

ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తావైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 08 ఉదయం నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఏపీ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.

 AP weather: next three days rain and cold waves in andhra pradesh districts

అల్ప పీడనం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఏపీ, యానాంలో దిగువ ట్రపోస్పియర్ లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఉత్తరకోస్తాంధ్రలో సోమ, మంగళ వారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో సోమ, మంగళ, బుధవారాల్లో ఒకటిరెండు చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రాయలసీమలో కూడా రానున్న రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది ఇలావుంటే, ఈ మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణ శాక తెలిపింది. పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డిసెంబర్ 8 వరకు మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

English summary
AP weather: next three days rain and cold waves in andhra pradesh districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X