weather: ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు, ఉరుములుమెరుపులు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. కాగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీలో మరో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

ఏపీలో మరో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

గురువారం నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తరకోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఉత్తరకోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఉత్తర కోస్తాంధ్రలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు


దక్షిణ కోస్తాంధ్రలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+