భారీగా పెరిగిన ఎండ తీవ్రత.. 40 డిగ్రీల రికార్డుకు దగ్గరలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. మార్చి నెల మూడో రోజే 30 దాటి నలబై డిగ్రీలకు దగ్గరవుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి వేడి గాలులు కూడా ప్రారంభమవుతున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి కోస్తా ఆంధ్ర వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా తమిళనాడు మరియు రాయలసీమ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. నిన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుండి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా కింది స్థాయిలోని గాలులు ప్రధానంగా పొడి వాతావరణాన్ని మోసుకొస్తున్నాయి.

AP Weather Update Temperatures to Rise in Rayalaseema Dry Weather and Fog Predicted for Next 3 Days

రాగల మూడు రోజుల వాతావరణ అంచనా:

1. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

ఈరోజు, రేపు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొంటుంది. అయితే తెల్లవారుజామున ఒకటి లేదా రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఇదే తరహా పొడి వాతావరణం కొనసాగుతుంది.

2. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈరోజు, రేపు ఎండ తీవ్రత మొదలవుతుంది. పొడి వాతావరణంతో పాటు అక్కడక్కడ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయి. ఎల్లుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండలు ముదురుతాయి.

3. రాయలసీమ:

రాయలసీమ జిల్లాల్లో ఈ మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. అయితే తెల్లవారుజామున పొగమంచు కురిసినప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వాతావరణ శాఖ హెచ్చరిక ..

వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎండలతో పాటు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేడి, అసౌకర్యమైన వాతావరణం (Hot and Humid) నెలకొంటుందని వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు.

బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు:

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఎండ తీవ్రత అర్థమవుతోంది:

  • తిరుపతి/కడప: 37°C - 39°C (సాధారణం కంటే ఎక్కువ)
  • విజయవాడ/గుంటూరు: 35°C - 36°C
  • విశాఖపట్నం: 32°C - 33°C (తేమ వల్ల ఉక్కపోత అధికం)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+