Weather update: ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికొద్ది రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితలద్రోణి.. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పయనిస్తుంది. దీంతో ఉపరితలద్రోణి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఏర్పడింది.
ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం నందు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం తదుపరి 4-5 రోజులలో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాఆంధ్రా తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
Recommended Video
శనివారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. గురువారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
శుక్ర, శనివారాల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యల ఎడతెరిపిస్తున్నప్పటికీ రోజులో ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications