తెలంగాణతో నీటి గొడవ: సాగర్, శ్రీశైలంను స్వాధీనం చేసుకోవాలని ఏపీ లేఖ!
హైదరాబాద్: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయనున్నట్లుగా తెలుస్తోంది.
కృష్ణా నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తార్కిక ముగింపు పలకాలంటే వీటిని కృష్ణా యాజమాన్య బోర్డు తన అధీనంలోకి తీసుకోవాల్సిందేనని ఏపీ పట్టుబడుతోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది.
కొద్ది రోజులుగా పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటలు, లేఖల యుద్ధం జరుగుతోంది. దీనిపై కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవడం లేదని ఏపీ తప్పుబడుతోంది.

ఏపీ రాసిన లేఖను తెలంగాణకు, తెలంగాణ రాసిన లేఖను ఏపీకి మాత్రం అది పంపించింది. సుప్రీం కోర్టు, బచావత్ తీర్పులను పరిగణనలోకి తీసుకుని వివాదాలను పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నా బోర్డు మౌనంగా ఉంటోందని ఆరోపిస్తోంది.
ప్రాజెక్టులను కృష్ణా బోర్డు తన అధీనంలోకి తీసుకుంటేనే కేటాయింపుల మేరకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. దాంతో, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను తక్షణమే అధీనంలోకి తీసుకోవాలని కోరుతూ కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని భావిస్తోంది. గతంలోను ఇలాంటి లేఖ రాసిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications