ఏపీకి ప్రత్యేక హోదా: వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఏపీ విద్యార్థి, యువజన ఐక్య కార్యాచరణ సమితి శుక్రవారం డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్‌లో విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.

వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు. అవిశ్వాస తీర్మానానికి పార్లమెంట్‌లో ఎవరూ అడ్డు తగలకుండా వెంకయ్య నాయుడు మద్దతు కూడగట్టాలన్నారు. కేంద్రం హోదా ప్రకటించే వరకు పోరాటాలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications