TTD: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అపశృతి జరగలేదు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు చిన్న అపశృతి చోటు చేసుకుందనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజస్తంభంకు ఉండే ఇనుప కొక్కెం ద్వారానే అర్చకులు గరుడ పఠాన్ని ఎగురవేస్తారు.

అయితే శుక్రవారం ద్వజస్థంభానికి ఉండే ఈ ఇనుప కొక్కెం విరిగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు తిరుమల అర్చకుల సహాయం తీసుకుని వెంటనే అప్రమత్తం అయ్యారని ప్రచారం జరిగింది. ద్వజస్థంభానికి ఏర్పాటు చేసిన ఇనుప కొక్కెం మరమ్మతులు చేపట్టారని ప్రచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం అర్చకుల సహాయంతో టీటీడీ అధికారులు, సిబ్బంది ధ్వజస్థంభానికి ఉండే ఇనుప కెక్కెం మరమ్మతులు చేపట్టారని ప్రచారం జరిగింది.

Apashruti took place during the Brahmotsavam of Srivari Salakatla in Tirumala

అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎలాంటి అపశృతి జరగలేదని శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్రవారం సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్శజారోహణ కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలిపారనే వ్యవహారంపై వివాదం చెలరేగిన సమయంలో నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలాంటి చిన్న అపశృతి జరిగిందని ప్రచారం జరగడంతో శ్రీవారి భక్తులు హడలిపోయారు అయితే దీనీని టీటీడీ అధికారులు ఇది తప్పుడు సమాచారం అని వివరణ ఇచ్చారు.

ఇలాంటి అపశృతులు జరగడానికి అవకాశం లేదని టీటీడీ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనపై సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు.

Apashruti took place during the Brahmotsavam of Srivari Salakatla in Tirumala

శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామల రావు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీసు అధికారులు, విజిలెన్స్, రెవెన్యూ, అటవి శాఖ అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+