11 మందితో వచ్చి 11 నిమిషాల్లో..జగన్ పై షర్మిల సెటైర్లు..!
ఏపీలో గత ఎన్నికల ముందు నుంచీ అన్న వైఎస్ జగన్ పై రాజకీయ పోరాటంతో పాటు వ్యక్తిగత విమర్శలూ చేస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల తన దాడిని మరింత ముమ్మరం చేశారు. అధికార కూటమిని మించిపోయి అన్నపై, ఆయన పార్టీ వైసీపీపై షర్మిల విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ అసెంబ్లీకి ఏడు నెలల తర్వాత హాజరైన జగన్ పై, వైసీపీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముందుగా గవర్నర్ ప్రసంగంపై షర్మిల విమర్శలు చేశారు. కూటమి మ్యానిఫెస్టోను సభలో గవర్నర్ చదివారన్నారు. గవర్నర్ ప్రసంగంలో పస లేదని, అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు అన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదన్నారు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదని షర్మిల విమర్శించారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే..బాబు గారి విజన్ 2047కి దమ్ము లేదన్నారు.

జగన్ కి ప్రజా శ్రేయస్సు కన్నా.. పదవులే ముఖ్యమని అనర్హత వేటు తప్పించుకునేందుకే సభకు వెళ్లారని షర్మిల ఆరోపించారు. దమ్ముంటే రేపటి నుంచి అసెంబ్లీ కి వెళ్ళాలని, లేకుంటే సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారలేదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది ? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని అడిగారు.
గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత…
— YS Sharmila (@realyssharmila) February 24, 2025
సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని జగన్ ను షర్మిల నిలదీశారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని షర్మిల కోరారు. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications