YS Sharmila: జగన్ కు అద్దం పంపిన షర్మిల - చంద్రబాబు పిచ్చి ఎందుకు ? మానసికస్ధితిపై ఆందోళన..
ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ కుటుంబ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మాజీ మతత్రి వివేకానందరెడ్డి హత్య కేంద్రంగా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య సాగుతున్న రాజకీయ పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. వివేకా హత్యపై న్యాయం కోసం తానూ, ఆయన కుమార్తె సునీత పోరాటం చేస్తుంటే చంద్రబాబు చేయిస్తున్నారంటూ జగన్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆయనకు ఓ అద్దం పంపారు. అందులో ఎవరి మొహం కనిపిస్తుందో చూసుకోవాలన్నారు.

జగన్ మానసిక పరిస్థితి గురించి తనకు భయంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. తనకు అద్దం పంపిస్తున్నాని, అందులో మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు మొహం కనిపిస్తుందా చూసుకోవాలన్నారు. తాను చంద్రబాబతో చేతులు కలిపినట్లు , కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక్క సాక్ష్యం అయినా, ఒక్కఆధారం అయినా చూపించ గలరా ? అని అడిగారు. జగన్ ఒక్క భ్రమలో ఉన్నాడని, ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉందన్నారు. జగన్ వైఖరి మాలోకాన్ని తలపిస్తుందన్నారు.
తన జన్మ కి చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిశానని షర్మిల తెలిపారు. తన కొడుకు పెళ్లి కి పిలవడానికి మాత్రమే వెళ్లానన్నారు. ఆనాడు వైఎస్సార్ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడన్నారు. ఆ స్ఫూర్తి తోనే తాను చంద్రబాబు ను పిలవడానికి వెళ్లానన్నారు. తాను 5 నిమిషాలు కూడా ఏనాడూ బాబుతో మాట్లాడలేదన్నారు. తాను చంద్రబాబు చెప్తే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా, బై బై బాబు అనే క్యాంపెయిన్ చేశానా అని అడిగారు.
సునీత,రేవంత్ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట, బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట, చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో...ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని షర్మిల జగన్ కు సూచించారు. జగన్ మానసిక పరిస్థితి పై నాకు ఆందోళన గా ఉందన్నారు. జగన్ గారు, మీరు అద్దం చూస్కోండి, మీకు మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు మొహం కనిపిస్తుందా ? అని ప్రశ్నించారు. సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా అని అడిగారు. హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే భయం ఎందుకన్నారు.
వైఎస్సార్ పేరును కాంగ్రెస్ లో చేర్చింది కాంగ్రెస్ కాదని, జగన్ మనిషి అన్నారు. పొన్నవోలుతో పిటీషన్ వేయించి మరి చేర్పించాడన్నారు. నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్ రావు, కానీ ఈ కేసు చెల్లలేదన్నారు. ఎర్రంనాయుడు వేసిన పిటీషన్ ను కోర్టు ఇంప్లేడ్ చేసిందన్నారు. విచారణ చేయమని మాత్రమే అనాడు కోర్టు చెప్పిందని, కానీ వైఎస్ఆర్ పేరును అప్పుడు పిటీషన్ లో చేర్చలేదన్నారు. పొన్నవోలు సుధాకర్ తో సుప్రీం కోర్టు వరకు వెళ్లి పేరు పెట్టించారన్నారు. ఇదే నిజమన్నారు. తారు మారు చేసే ప్రయత్నం చేసినా నిజం దాగదన్నారు.
గిఫ్ట్ గా పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారని షర్మిల ఆరోపించారు. సీఎం అయిన 6 రోజులకే అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారన్నారు. మూడు సార్లు చార్జీ షీట్ లో పెట్టాలి అనుకున్న వ్యక్తికి మీరు పదవి ఇచ్చారని విమర్శించారు. ఏ సంబంధం లేకుంటే ఎందుకు ఇస్తారన్నారు. కళ్ళకు ఎదుట అందరికీ స్పష్టంగా కనిపించిందన్నారు. కాంగ్రెస్ కి సీబీఐ ఛార్జ్ షీట్ కి సంబంధం లేదన్నారు. మమ్మలని ఈ విషయంలో ఊసరవెల్లి అంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని తాను చెప్పినట్లు వీడియోలు ప్లే చేస్తున్నారన్నారు. నిజానికి ఆరోజు తనకు నిజం తెలియదన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి అద్దం గిఫ్ట్ పంపిన కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి..!!#YSSharmila #YSJagan #KadapaMP #APElections2024 #Oneindiatelugu pic.twitter.com/wWa1TKqueU
— oneindiatelugu (@oneindiatelugu) May 4, 2024
తాను కాంగ్రెస్ పెట్టించింది అనుకున్నట్లు షర్మిల తెలిపారు. సోనియాను కలిశాక అసలు విషయం తెలుసుకున్నట్లు వెల్లడించారు. సోనియా నాతో మేము ఎందుకు పెడతాం అని చెప్పారన్నారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలసినప్పుడు కూడా తెలుసుకున్నాన్నారు. జగన్ కావాలని పెట్టించినట్లు ఉండవల్లి స్పష్టం చేశారన్నారు.అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతే తాను ఈ విషయం చెప్పగలుగుతున్నట్లు తెలిపారు.
ఈ మధ్య జగన్ నేషనల్ మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నారని, తాను చంద్రబాబు మనిషి అంటున్నారని, తనను చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడని చెప్తున్నారని షర్మిల ఆక్షేపించారు. తాను బాబు మాట వింటున్నానని చెప్తున్నారన్నారు. కానీ తాను వైఎస్సార్ బిడ్డనని, తానెంత ఎంత మొండి దాన్నో జగన్ కి తెలుసన్నారు. తాను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తి కాదన్నారు. తనకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదన్నారు.
-












Click it and Unblock the Notifications