సడన్ గా తమిళనాడు సీఎంఓ లో షర్మిల: విజయ్ తో భేటీ
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. భర్త అనిల్ తో కలిసి ఇటీవలే ఆమె చెన్నైకి వెళ్లారు. ఇప్పటికే తమిళనాడు పీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, లోక్ సభ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ తో సమావేశం అయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివాదాస్పద వ్యవహారం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తమిళనాడుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా.. చెన్నైలో ఆమె ముఖ్యమంత్రి విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహ మహోత్సవానికి తప్పక హాజరుకావాలని కోరుతూ వైఎస్ షర్మిల స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ సమయంలో షర్మిల వెంట అనిల్ ఉన్నారు. విజయ్‌తో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వివరాలను క్లుప్తంగా అందులో పోస్ట్ చేశారు.

తాము కలిసిన వేళ.. విజయ్ చూపిన ఆదరణ, ఆత్మీయతను షర్మిల ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయనను ప్రశంసించారు. కాబోయే నూతన దంపతులకు విజయ్.. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారని, ఆయన చూపిన ఆప్యాయతకు తాము ఎంతో కృతజ్ఞులమని పేర్కొన్నారు. ఈ ముఖాముఖి భేటీ వారి మధ్య ఉన్నస్నేహానికి అద్దం పట్టింది.
నవంబర్ లో వివాహ మహోత్సవం..
కాగా.. వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోన్న విషయం తెలిసిందే. వైఎస్ అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో ఈ ఏడాది నవంబర్ 25వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా ముగిసింది. దీంతో వైఎస్ షర్మిల, అనిల్ దంపతులు.. పెళ్లి ఏర్పాట్లల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ ను కలిసి వెడ్డింగ్ కార్డు అందజేస్తారని తెలుస్తోంది.
ఒకే వేదికపై..
ఈ వివాహ వేడుక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి రానున్నారు. చెన్నై పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల తమిళనాడులోని ఇతర రాజకీయ పార్టీల పెద్దలను కూడా వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నవంబర్ లో జరగనున్న ఈ శుభకార్యానికి పలువురు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
