టీడీపీలో రెడ్లను తొక్కేసారు: అది ఒక కులం కాదు..గుణం..ధైర్యం: రోజా సంచలనం..!
వైసీపీ ఫైర్ బ్రాండ్.. ఏపీఐఐసీ చైర్మన్ ఆర్‌కే రోజా మరో సారి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు..లోకేశ్ మీద సంచలన వ్యాఖ్యలు చేయటంలో..విరుచుకుపడటంతో ముందుండే రోజా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతం కంటే భిన్నంగా..దూకుడు తగ్గించారు.
అయితే, ఇప్పుడు రెడ్ల కులం గురించి..అదే విధంగా చంద్రబాబు హాయంలో పడిన ఇబ్బందుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. రెడ్డి అంటే ఒ కులం కాదని..ఒక గుణం..ఇక ధైర్యం..ఒక భరోసా అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రోజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
నగర ఎమ్మెల్యే రోజా కాకినాడ సమీపంలోని అచ్చంపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావటంతో ఈ ఏడాది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కార్తీక వనసమారాధనలను సంతోషంగా జరుపుకుంటున్నారనని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తెలుగుదేశం పాలన మీద తీవ్ర విమర్శలు చేసారు. గత అయిదేళ్ల కాలంలో రెడ్లను తొక్కిపెట్టి..తీవ్రంగా అవమానించారని రోజా ఆరోపించారు. బడుగు..బలహీన వర్గాలను టీడీపీ అన్యాయం చేసిందని విమర్శించారు.
రెడ్లందరూ కష్టపడి వైసీపీని 151 సీట్లలో గెలిపించారని రోజా వ్యాఖ్యానించారు. జగన్ ను సీఎంగా చేసుకొని గర్వంగా చెప్పుకొనేలా పని చేసారని అభినందించారు. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక కుర్చీ కాదని..అది బాధ్యతాయుతమైన పదవి అని వివరించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ నుంచి వచ్చిన వారే.
అయితే చంద్రబాబు దోచుకుతినడానికే ముఖ్యమంత్రి పదవి చేపట్టారంటూ ఆరోపించారు. వారే. అయితే చంద్రబాబు దోచుకుతినడానికే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. జగన్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఆ బాధను ముఖంలో కనబడనివ్వకుండా ప్రజల కష్టాన్ని దూరం చేసే విధంగా పాలిస్తున్నారు. రెడ్డి అంటే ఒక కులం కాదు.. గుణం..ధైర్యం.. భరోసా అంటూ వ్యాఖ్యానించారు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డే దీనికి నిదర్శనమని తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications