కాకా, కెసిఆర్! అది వ్యభిచారం: అమీర్, మందకృష్ణపైనా

కర్నూలు: సమైక్య ప్రజా గర్జనలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల పైన పలువురు వక్తలు మండిపడ్డారు. కర్నూలులో సమైక్య ఆదివారం సమైక్య ప్రజా గర్జన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేత ప్రకాశ్ మాట్లాడారు. మందకృష్ణ ఒక ప్రాంతానికి చెందిన నాయకుడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

సమైక్యాంధ్రనే తమ డిమాండ్ అన్నారు. మందకృష్ణను తాము నిలదీస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ బిల్లులతో హైదరాబాదును అభివృద్ధి చేశాయని కారెం శివాజీ ఆరోపించారు.

Manda Krishna Madiga

కాకా కెసిఆర్..: ఎపిఎన్జీవో నేత అమీర్ అహ్మద్

కెసిఆర్ పైన ఎపిఎన్జీవో నేత అమీర్ అహ్మద్ మండిపడ్డారు. కాకా కెసిఆర్ అంటూ ఆయన ప్రసంగించారు. కెసిఆర్ పది జిల్లాలతో సభ పెట్టారని, తాము కర్నూలు ఒక జిల్లాలోనే సభ పెడితే లక్షల సంఖ్యలో జనం వచ్చారని దీనిని కాకా తెలుసుకోవాలన్నారు. కెసిఆర్ సామాన్యుని జీవితంతో చెలగాటమాడుతున్నారని, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్, షోయబుల్లా ఖాన్ వారసులుగా తాను వచ్చానన్నారు.

షోయబుల్లా ఖాన్ ప్రతి వార్తను వాస్తవంగా నిజాం కాలంలో ప్రజలకు చెప్పారని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామన్నారు. విజయనగరం నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన కెసిఆర్ ఎపికి శకునిలా తయారయ్యారని, ఆయనకు తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం మమకారం లేదన్నారు. దుర్యోదనుడికి శకుని ఎలాగో రాష్ట్రానికి కెసిఆర్ అలాగే అన్నారు. కెసిఆర్‌ను తరిమి కొట్టే రోజు దగ్గర్లో ఉందన్నారు.

కెసిఆర్ విడిపోయి కలిసుందామంటున్నారని, కలిసుంటే సంసారం విడిపోయి కలిసుంటే వ్యభిచారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన తాగి మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణలో వెయ్యి మంది చావడానికి కెసిఆర్ కారణమని ఆరోపించారు. ఇటలీ నుండి వచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంఎధీ ఇలా చేస్తుందనుకోలేదన్నారు. నాడు నిజాంకు ఘోరీ కట్టినట్లుగా త్వరలో కెసిఆర్‌కు ఘోరీ కడతారన్నారు.

అరవై రోజులుగా ఉద్యమం: సంపత్

అరవై రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతోందని ఎపిఎన్జీవో నేత సంపత్ కుమార్ అన్నారు. ఉద్యోగులు తమకు కావాల్సింది జీతాలు కాదు జీవితాలని చెబుతున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకులు లేరని, సమైక్యవాదులే నాయకులన్నారు. ఉద్యమం నిస్వార్థంగా సాగుతోందన్నారు. తెలుగు వారి భాష, భావం, గుండె చప్పుడు సమైక్యాంధ్ర అన్నారు. ఇన్నాళ్లు కలిసుండి ఇప్పుడెందుకు విడిపోవాలని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+