వైసీపీలో నియామకాలు: చిలుకలూరిపేటకు విడదల రజిని

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామకాల ప్రకటన విడుదల చేసింది. చిలుకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజినీని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు ) నియమితులయ్యారు.

కార్యకర్తలకు అండగా ఉంటానన్న జగన్

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ యుద్ధంలో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.

Appointments in YSRCP Vidadala Rajini as Chilakaluripet coordinator

మేము రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుశ్సాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ తోపాటు వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+