కూటమిలో గ్రూపు-2 కలకలం:ఎమ్మెల్సీ గెలుపు లెక్కలు తారుమారు..!?

ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం కూటమిలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం లేఖ రాసినా.. సీఎం తన అభిప్రాయం చెప్పినా ఏపీపీఎస్సీ నిర్ణయంలో మార్పు రాలేదు. ఏపీపీఎస్సీ చెబుతున్న ఎన్నికల కోడ్ కారణమే ఇప్పుడు అదే ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై ప్రభావం చూపటం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధుల పైన ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగులా మారింది. పరీక్ష నిర్ణయ ప్రభావం ఏ మేర ఎన్నికల పైన ఉంటుందనే లెక్కలతో అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ
గ్రూపు -2 వివాదం ఇప్పుడు కూటమి సమర్థతకు పరీక్షగా మారుతోంది. గ్రూపు -2 అభ్యర్ధులు పరీక్ష వేళ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఒక దశలో ప్రభుత్వ జోక్యం తో పరీక్ష వాయిదా పడుతుందనే ఆశించారు. కానీ, ఏపీపీఎస్సీ పరీక్ష యథాతథంగా నిర్వహించాల నే నిర్ణయంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు రాజకీయ పరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 27న క్రిష్ణా- గుంటూరు, అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులు పీడీఎఫ్ నేతలతో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో గ్రూపు -2 పరీక్ష వివాదం పీడీఎఫ్ అభ్యర్ధులకు అయోచిత వరంగా మారుతోంది.

APPSC Decision over Group-2 Examination chances to impact on MLC Elections

పరీక్ష యథాతథం
గ్రూపు-2 కు సంబంధించి రోస్టర్‌ పాయింట్లలో తప్పులున్న కారణంగా ప్రధాన పరీక్షను రద్దు చేయాలని అభ్యర్ధులు కోర్టుకెళ్లారు. రోస్టర్‌లో తప్పులు జరిగిన్నట్లు ప్రభుత్వం కూడా అంగీకరిం చింది. అయితే, నిరుద్యోగులు కోరుతున్న విధంగా చర్యలు తీసుకోవడంలో నాన్చుడు వైఖరి అవ లంభించింది. చివరకు పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎపిపి ఎస్సీకి లేఖ రాసినా ఫలితం కనిపించలేదు. పరీక్షను వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఆదేశించ లేదని కనుక ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని కమిషన్‌ సమాధానం ఇచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పరీక్షకు కొన్ని గంటల ముందు స్పందించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది.

టఫ్ ఫైట్
పరీక్ష వాయిదా వేయకపోతే ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో కూటమి - పీడీఎఫ్ మధ్య 20 -22 వేల ఓట్ల తేడానే ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. చివరి వరకు కూటమి నేతలు పరీక్షల పైన తమకు హామీ ఇస్తూ.. చివరి నిమిషంలో చేతులెత్తేయటం పైన గ్రూపు -2 అభ్యర్ధులు మండి పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 వేలకు పైగా గ్రూపు -2 అభ్యర్ధులు ఉన్నారు. దీంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పరీక్ష ప్రభావం ఏ మేర ప్రభావం చూపుతుందనే టెన్షన్ కూటమిలో మొదలైంది. మరి..కూటమి ఎలా ముందుకు వెళ్తుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+