430 పోస్టులకు నోటిఫకేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ) పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
ఎంపిక విధానం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధించిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా పోస్టులు కేటాయించనున్నారు.

పోస్టుల వివరాలు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్,
ఖాళీల సంఖ్య : 430
పే స్కేల్ : రూ.16,400 - 49,870
దరఖాస్తు ప్రారంభ తేదీ : 05.03.2019
దరఖాస్తుకు చివరి తేదీ : 30.03.2019


Click it and Unblock the Notifications