ఏపీపీఎస్సీలో కీలక సంస్కరణలు.. ప్రభుత్వం ఆమోదం

ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ తీసుకొచ్చింది. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది ఏపీపీఎస్సీ... ఉద్యోగాల ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తోన్న విధానంలో ఏపీపీఎస్సీ మార్పు చేసింది. అభ్యర్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినపుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

APPSC Reforms Exam Process Single Screening Test Replaces Prelims and Mains for Jobs

ఈ నిర్ణయంతో వేగంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీపీఎస్సీ కు వెసులుబాటు కలగనుంది. ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసే అవకాశం నియామక సంస్థకు లభిస్తుంది. నూతన విధానంతో నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+