ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - వారితో జాగ్రత్త, తీవ్రరూపం..!!

మోచా తుఫాను ఏపీ పై పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరగటానికి కారణమైంది. సాధారణం కంటే వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణతాపాన్ని తట్టుకోలేక వయసు మళ్లిన వారు.. చిన్న పిల్లలు అల్లాడుతున్నారు. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో రెండు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 136 మండలాలకు వడ గాలులు తప్పవని..ప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వడగాలుల తీవ్రత: రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగటంతో పాటుగా వడగాలుల తీవ్రత అధికమైంది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. శనివారం గరిష్ఠంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవలో 43.2 , గుంటూరు జిల్లా పొన్నూరులో 43.17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఏడు గంటలకు కూడా పలు ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 33 డిగ్రీలకు చేరాయి. అర్ద్రరాత్రి దాటాక కూడా వేడిగాలులు తగ్గటం లేదు. తెల్ల వారు జాము నుంచే ఉక్కపోత పలు ప్రాంతాల్లో మొదలవుతుండటంతో అల్లాడిపోతున్నారు.

heatwave

భారీగా ఉష్ణోగ్రతలు: పలు జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, క్రిష్ణా , ఎన్టీఆర్, గుంటూరు , బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం గరిష్ణ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రానున్న రెండు రోజుల్లో అధిక శాతం మండలాలు వడగాలుల ముప్పును ఉదుర్కొంటాయని విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది.

heatwave

136 మండలాలకు అలర్ట్:
136 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 మండలాలు, అనకాపల్లిలో 19, బాపట్లలో 23, తూర్పుగోదావరి 18, గుంటూరు 15, కాకినాడ 21, కోనసీమ 18, క్రిష్ణా 24, నంద్యాల 7, ఎన్టీఆర్ 16, పల్నాడు 26, పార్వీపురం మన్యంలో 11, ప్రకాశంలో 21, శ్రీకాకుళం లో 1 మండలం, నెల్లూరు లో 13, విజయనగరంలో 12, పశ్చిమగోదావరి లో 16. కడప లో 11 మండలాల్లో ఆదివారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందది. దీంతో, వయసు మళ్లిన వారితో పాటుగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పని సరి అయితేనే బయటకు వెళ్లాలని సూచన చేసింది. మూడు రోజుల పాటు ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+