మండే ఎండల వేళ రిలీఫ్, దూసుకొస్తున్న అల్ప పీడనం- ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు..!!
వాతావరణంలో భిన్నమైన పరిస్థితుల నెలకున్నాయి. వేసవి తరహాలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు, మూడు రోజులు పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడనున్నది. దీని ప్రభావంతో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
మండుతున్న ఎండల వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 (మంగళవారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మూడు రోజులు భారీ వర్షాలు
కాగా, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చురుగ్గా సాగుతుండగా రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు మొదలయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధవారం రాయలసీమలోని కొన్ని చోట్ల, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
